అంతర్జాతీయ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్‌కు, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పోటీకి వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్ సైతం ‘ది బిగ్ ఫ్రీడం సేల్’ను ప్రకటించింది. 72వ స్వాతంత్య్రం సందర్భంగా ఈ బిగ్ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ రివీల్ చేసింది. 2018 ఆగస్టు 10 నుంచి ఆగస్టు 12 వరకు ఈ సేల్‌ను నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే ఈ సేల్‌లో భాగంగా అందించే ఆఫర్లను మాత్రం ఫ్లిప్‌కార్ట్ బహిర్గతం చేయలేదు.
ఈ 72 గంటల సేల్‌లో బ్లాక్‌బస్టర్ డీల్స్‌ను, ప్రైస్ క్రాష్ ఆఫర్లను, రష్ అవర్ డీల్స్‌ను, ఫ్రీడం అవర్‌ను, గంట గంటకు పలు డీల్స్‌ను అందించనున్నట్టు మాత్రం పేర్కొంది. ఈ సేల్‌లో ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి ప్రైస్ క్రాష్ ఆఫర్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. దాంతో పాటు ఆగస్టు 10న అంటే ఫ్లిప్‌కార్ట్ సేల్ ప్రారంభమయ్యే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ‘రష్ అవర్’ను చేపట్టనున్నట్టు పేర్కొంది.
ఫ్లిప్‌కార్ట్ మూడు రోజుల సేల్‌లో ‘ఫ్రీడం కౌంట్‌డైన్’ను నిర్వహించనుంది. ఇది సాయంత్రం 7.47 గంటల నుంచి 8.18 గంటల వరకు ఉంటుంది. ఈ 31 నిమిషాల్లో పలు కేటగిరీలోని ఉత్పత్తులన్నింటిపై ధర తగ్గింపు ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ ఫ్రీడం సేల్‌లో యూజర్లకు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తోంది.
అంతేకాక షావోమి, శాంసంగ్, ఆపిల్ వంటి పలు బ్రాండ్ స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఉండనున్నాయని, ల్యాప్‌టాప్, ఆడియో ఈక్విప్మెంట్, కెమెరాలపై 80 శాతం వరకు తగ్గింపు ఉండనుందని సమాచారం. ఈ సేల్‌లో ప్రొడక్ట్‌లను కొనుగోలు చేయాలని భావించే కస్టమర్లు విష్‌లిస్ట్‌లో మీకు ఇష్టమైన ప్రొడక్ట్‌లను యాడ్ చేయాలని, మీ అకౌంట్‌కు క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలను సేవ్ చేసుకోవాలని, డెలివరీ అడ్రస్‌ను ముందస్తుగానే అప్డేట్ చేసుకోవాలని ఫ్లిప్‌కార్ట్ సూచించింది.
ఫ్లిప్‌కార్ట్ కంటే ఒక్కరోజు ముందుగానే అమెజాన్ తన ఫ్రీడం సేల్‌ను ప్రారంభింబోతుంది. అమెజాన్ సేల్ ఆగస్టు 9 నుంచి ఆగస్టు 12 వరకు ఉండనుంది. అమెజాన్ ఇండియా గత వారం ప్రకటించిన ఈ ‘ఫ్రీడం సేల్’లో వన్‌ప్లస్ 6, రియల్‌మి 1, మోటో జీ6 వంటి స్మార్ట్ఫోన్లపై పలు డీల్స్‌ను, ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు తెలిపింది.