స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగాక అదే తరహాలో మొబైల్ అప్లికేషన్ల వాడకం కూడా పెరిగింది. వాటిని ఉపయోగించి కాసింత పని భారం తగ్గించుకునే యాప్‌లు ఉన్నాయి. ఇలా రోజూ వారి పనిలో మొబైల్ యాప్‌లు వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయనేది వాస్తవం. మరి అలాంటి యాప్స్ ఏమున్నాయి. తెలుసుకుందామా ?
గుర్తు చేసే యాప్ : మన దినచర్యలకు తోడుగా నిలిచే యాప్ ‘సన్‌రైజ్ క్యాలెండర్’. రోజులో ఏ సయమంలో ఏ పనిచేయాలనుకుంటు న్నామో తెలియజేస్తుంది. ఈ యాప్ గూగుల్ క్యాలెండర్‌తోపాటు ఎవర్‌నోట్ వంటి అప్లికేషన్లతో సులువగా అనుసంధానమవుతుంది. పార్టీలు, ఇతర కార్యక్రమాలకు బంధుమిత్రులను ఆహ్వానించేందుకు ఉపయోగపడుతుంది. రోజువారీ వ్యవహారాలను చెక్కబెడుతుంది. ఫేస్బుక్ ఈవెంట్స్, గూగుల్ మ్యాప్స్, లింక్డ్ఇన్ కాంటాక్ట్స్తోనూ ఇంటిగ్రేట్ అవుతుంది.
ఆపద్బంధు : ఏదైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు స్నేహితులు, బంధువు లను రహస్యంగా సంప్రదించాల్సిన పరిస్థితి ఉంటే ‘సర్కిల్ ఆఫ్ 6’ యాప్ తోడ్పడుతుంది. ముఖ్యంగా మహిళల భద్రతపై ఆందోళన నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అప్లికేషన్‌పై రెండుసార్లు ట్యాప్ చేస్తే చాలు… ముందుగానే రాసిపెట్టుకున్న మూడు మెసేజ్‌ల్లో ఒకటి మీ కాంట్రాక్ట్స్లోని ఆరుగురికి చేరిపోతుంది. జీపీఎస్ ద్వారా మీరెక్కడున్నారో చెబుతుంది. మిమ్మల్ని పిక్ చేసుకోవాల్సిందిగా ఒక సందేశాన్ని పంపుతుంది. ఇంకో సందేశం ద్వారా వెంటనే కాల్ చేయాల్సిందిగా ఫ్రెండ్స్‌కు రిక్వెస్ట్ వెళ్తుంది. ఈ యాప ద్వారా మహిళా భద్రతాకు ఉద్దేశించిన హాట్‌లైన్‌తో నేరుగా సంప్రదింపులు చేసేందుకు అవకావం ఉంటుంది.
అనారోగ్య బారిన పడితే : ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు డాక్టర్‌ను వెంటనే సంప్రదించడం కొన్ని సందర్భాల్లో కష్టం. అయితే… మనకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏమిటో పేర్కొంటే డాక్టర్‌ను ఎంత సమయంలో సంప్రదించొచ్చో చెప్పే అప్లికేషన్ ‘వెబ్ఎండీ’. ఆండ్రాయిడ్‌లో ఇది అందుబాటులో ఉంది. అనారోగ్య లక్షణాలు పేర్కొంటే.. వచ్చిన వ్యాధి ఏమిటో చెప్పడంతోపాటు ఎలాంటి ప్రాథమిక చికిత్స తీసుకోవచ్చో సూచిస్తుంది. అత్యవసర సమయంలో ఎలా స్పందించాలో చెబుతుంది.
స్టూడెంట్స్ కోసం : మానసిక స్థితి, అకడమిక్ పెర్ఫార్మెన్స్, ప్రవర్తన, భావోద్వేగాలను అంచనా వేసే యాప్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ‘స్టూడెంట్ లైఫ్’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఆండ్రాయిడ్ యాప్ ఇది. సంతోషం, ఒత్తిడి, ఒంటరితనం ఎలాంటి భావోద్వేగాన్నయినా గుర్తిస్తుంది. విద్యార్థులే కాదు.. ఎవరైనా తమ మానసికస్థితిని దీని ద్వారా తెలుసుకోవచ్చు.
మన రైతుబజార్ : రైతుబజార్‌లోని కూరగాయల ధరలు తెలుసుకో వడానికి యాప్ ఒకటి అందుబాటులో ఉంది. ‘మన రైతుబజార్’ అనే ఈ అప్లికేషన్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసుకుంటే చాలు.. ఏ కూరగాయ ఎంత ధర పలుకుతోందో తెలుసుకోవచ్చు. సాధారణం గా కూరగాయల ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. అయితే… ఈ యాప్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ముఖ్య నగరాల రైతుబజార్లలోని ధరలు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవచ్చు.
మందులు వేసుకునేందుకు : వృద్ధాప్య జీవనశైలిలో మందులు మింగడం ఒక భాగమైపోయింది. మెడిసిన్ వాడటానికి సంబంధించి అలర్ట్ చేస్తుంది ఓ యాప్. ‘పిల్బాక్సీ’ అనే పేరుతో రూపొందించిన ఈ అప్లికేషన్లో మెడిసిన్స్కు సంబంధించిన సమాచారం ఎంటర్ చేస్తే మందులు వేసుకునే సమయాన్ని అది గుర్తు చేస్తుంది.
నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు చెక్ : నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పో తున్న టీనేజర్లను ద ష్టిలో పెట్టుకుని టీన్ డ్రైవర్ సపోర్ట్ సిస్టం (టీడీఎస్ఎస్) పేరుతో స్మార్ట్ ఫోన్ యాప్‌ను రూపొందించారు. తమ పిల్లలు ఏ విధంగా డ్రైవింగ్ చేస్తున్నారో తల్లిదండ్రులకు ఈ యాప్ ద్వారా తెలిసిపోతుంది. అంతేకాదు.. పిల్లల ప్రవర్తన గురించి కూడా సమాచారం అందుతుంది. కుర్రకారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తుంటే తల్లిదండ్రులకు మేసేజ్ వెళ్తుంది.
Leave a Reply