31 రోజుల్లో రూ.204.86 లక్షల కోట్లు
పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ ద్వారా జరిపే లావాదేవీలు అనూహ్యంగా పెరిగాయి. గత ఆగస్టులో దేశవ్యాప్తంగా 244.81 కోట్ల డిజిటల్ ద్వారా చెల్లింపులు జరిపారని కేంద్ర ఐటీ శాఖ మంత్రి వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 2016లో నమోదైన లావాదేవీలతో పోలిస్తే మూడు రెట్లు అధికం. గడిచిన రెండేండ్లకాలంలో దేశీయంగా డిజిటల్ ద్వారా చెల్లింపులు జరిపేవారి సంఖ్య అమాంతం పెరిగారు. భీమ్-యూపీఐ, ఆధార్‌తో చెల్లింపులు జరుపడం, జాతీయ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్(ఎన్‌ఈటీసీ)ల వంటి యాప్‌లతో వ్యక్తి నుంచి వ్యక్తికి(పీ2పీ), వ్యక్తి నుంచి వ్యాపారికి(పీ2ఎం)లకు చెల్లింపులు జరిపినట్లు మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఆగస్టు 2018లో డిజిటల్ లావాదేవీల సంఖ్య 207 శాతం పెరిగి 244.81 కోట్లకు చేరుకున్నాయి. అదే అక్టోబర్ 2016లో ఇవి 79.67 కోట్లుగా ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల విషయానికి వస్తే రూ.108.7 లక్షల కోట్ల నుంచి రూ.204.86 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే 88 శాతం పెరిగాయన్న మాట. గడిచిన రెండేండ్లకాలంలో డిజిటల్ చెల్లింపుల్లో విపరీతమైన వృద్ధిని నమోదు చేసుకున్నదని తెలిపింది. నవంబర్ 8, 2016న ప్రధాని నరేంద్ర మోదీ పాత రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రజలు డిజిటల్ బాటపట్టారు.
Leave a Reply