అదిరిపోయే ఫీచర్లతో హువావే ‘హానర్ 10’ స్మార్ట్‌ఫోన్‌ను గత మూడు నెలల క్రితమే గ్లోబల్‌గా లాంచ్ చేసిన తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ విక్రయాల్లో రికార్డులు సృష్టిస్తోంది. లాంచ్ చేసిన 3 నెలల వ్యవధిలోనే 30 లక్షల విక్రయాల మైలురాయిని తాకి, హానర్ 10 దూసుకుపోయింది. ఈ విషయాన్ని కంపెనీ తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో వెల్లడించింది. ‘30 లక్షల హానర్ 10 విక్రయాలు, 30 లక్షల మందికి కృతజ్ఞతలు. హానర్ 10కు సపోర్టు ఇచ్చిన హానర్ అభిమానులందరికీ అభినందనలు. మీ సాయం లేకుండా.. ఈ మైలురాయిని తాకడం సాధ్యమయ్యేది కాదు’ అని కంపెనీ ట్వీట్ చేసింది. లాంచ్ చేసిన నెలలోనే 1 మిలియన్ పైగా యూనిట్లు విక్రయమయ్యాయి. అంటే సగటున నెలకు 10 లక్షల యూనిట్లు విక్రయాలను నమోదు చేసింది. ఆన్‌లైన్ రిటైలర్ షాపీలో కూడా హానర్ 10 బెస్ట్ సెల్లింగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా నిలిచింది. రష్యా, ఫ్రాన్స్‌ల్లో కూడా ఈ స్మార్ట్‌ఫోనే బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంది.
తొలుత హానర్ 10 స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్‌లో లాంచ్ అయింది. అక్కడ లాంచ్ చేసిన రెండు నెలల అనంతరం గ్లోబల్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ హ్యాండ్ సెట్ ఖరీదు చైనాలో 2,599 సీఎన్‌వైగా, భారత్‌లో రూ.32,999గా ఉంది. భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది.
హానర్ 10 స్పెసిఫికేషన్లు
5.84 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ నాచ్ డిస్ప్లే (ఐఫోన్ టెన్ మాదిరి)
హువాయి కిరిన్ 970 ప్రాసెసర్
6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
24ఎంపీ + 16ఎంపీ డ్యుయల్ వెనుక కెమెరా, 24 ఎంపీ ఫ్రంట్ కెమెరా
ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 3400 ఎంఏహెచ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఈఎంయూఐ 8.1 ఇంటర్‌ఫేస్
Leave a Reply Cancel reply