1. వాట్సాప్ : ప్రస్తుతం ఉన్న మెసేజింగ్ యాప్‌లన్నింటిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది వాట్సాప్. ఈ ఏడాది మొదట్లో ఇది మూడో స్థానంలో ఉండేది. కానీ ఇటీవల వస్తున్న ఫీచర్లతో ప్రస్తుతం ఇది టాప్ వన్‌లో ఉంది.
2. ఫేస్బుక్ : ఈ ఏడాది మొదటి మొదటి మూడు నెలల్లోనే అత్యధిక మంది యూజర్లు డౌన్లోడ్ చేసిన యాప్‌గా సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ అగ్రస్థానంలో నిలిచింది.
3. ఎఫ్బీ మెసెంజర్ : గతేడాది నాల్గో స్థానంలో ఎఫ్బీ మెసెంజర్ నిలిచింది. ఇన్స్టంట్ మెసెజింగ్లో తమదైన శైలి పోషిస్తున్న ఈ యాప్ ప్రస్తుతం ఎక్కువ పాపులర్ అయింది. అత్యధిక మంది డౌన్లోడ్ చేసుకున్న లిస్టులో ఇది మూడో స్థానంలో ఉంది.
4. షేర్ ఇట్ : వివిధ డివైస్ల మధ్య ఫైళ్లు, ఫొటోలు షేర్ చేసుకోవడాన్ని సులభతరంగా మార్చిన షేర్ ఇట్ యాప్ ఐదో స్థానం సంపాదించింది.
5. యూసీ బ్రౌజర్ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను వెనక్కి నెట్టి యూసీ బ్రౌజర్ రెండో స్థానంలో నిలిచింది. ఫాస్ట్ బ్రౌజింగ్, డాటా సేవింగ్ వంటి ఫీచర్ల వల్ల గతేడాదితో పోలిస్తే ఈసారి యూజర్ల సంఖ్య పెంచుకోగలిగింది యూసీ బ్రౌజర్.
6. జియో టీవీ : గతేడాది చివరి స్థానంలో నిలిచిన జియో టీవీ ఈసారి ఆరో స్థానానికి ఎగబాకింది. సీరియల్స్, క్రికెట్ మ్యాచులు చూసేందుకు వీలుగా రూపొందిచబడిన ఈ యాప్ తన యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది.
7. ఎయిర్ టెయిల్ టీవీ : తక్కువ ధరకే డేటాను అందించడం ద్వారా ఎయిర్టెల్ టీవీ యూజర్ల సంఖ్యను పెంచుకొని ఏడో స్థానంలో నిలిచింది.
8. హాట్ స్టార్ : స్టార్ నెట్‌వర్కింగ్‌కు సంబంధించిన హాట్ స్టార్ మొదటి సారిగా మోస్ట్ డౌన్లోడెడ్ యాప్‌ల జాబితాలో చోటు సంపాదించుకుని ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించుకుంది.
9. ట్రూకాలర్ : రాంగ్ కాల్స్ నుంచి విముక్తి పొందడానికి రూపొందించిన ట్రూకాలర్ యాప్‌కు యూజర్లు ఎక్కువగానే ఉన్నారు. అయితే గతేడాది ఎనిమిదో స్థానంలో నిలిచిన ఈ యాప్ ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి పడిపోయింది.
10. హైప్స్టార్ : వీడియో కమ్యూనిటీ యాప్ హైప్స్టార్ డౌన్లోడ్ చేసుకుంటే ఒకే క్లిక్‌తో వైరల్ వీడియోలు చూసేయొచ్చు. గతేడాది టాప్ 10లో చోటు దక్కించుకోలేక పోయిన ఈ యాప్ ఈసారి టాప్‌టెన్‌లో నిలిచింది.ఈ టాప్- 10 యాప్‌లు మీ మొబైల్లో కూడా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మరి.
Leave a Reply