సౌత్ కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఫోల్డబుల్ ఫోన్‌ను ప్రదర్శించింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. దీనికోసం యాప్‌లను సిద్ధం చేయాల్సిందిగా ఆండ్రాయిడ్ డెవలపర్లను శాంసంగ్ కోరింది.
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికా మొబైల్ ప్రోడక్ట్ స్ట్రాటజీ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జస్టిన్ డెనిసన్ 7.3 అంగుళాలు స్క్రీన్‌తో ఈ డివైస్ మోడల్‌ను ప్రదర్శించారు. ప్రస్తుతానికి కేవలం ఫోను డిజైన్ మాత్రం విడుదల చేసిన కంపెనీ దీనిని ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేదీ స్పష్టం చేయలేదు. చూడ్డానికి పాకెట్ సైజ్‌లో ట్యాబ్‌లాగాన కనిపించే ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర, పేరు, ప్రత్యేకతల వివరాలు ఇంకా వెల్లడించ లేదు. అయితే 7.3 అంగుళాల తెరతో మధ్యకు మడతపెట్టేందుకు వీలుగా ఇది ఉంటుందట.
కాగా.. ఇటీవలే చైనా సంస్థ రాయల్ కార్పొరేషన్ 7.8 అంగుళాల ఆండ్రాయిడ్ మడతపెట్టే ఫోనును ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. శాంసంగ్, ఎల్‌జీ, హువావేల కంటే ముందుగానే అద్భుత ఆవిష్కారం చేసి పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
Leave a Reply