హైదరాబాద్, పిఐబి : నల్గొండ లో ప్రధాన తపాలా కార్యాలయ౦ లో పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్ర౦ (పిఒపిఎస్ కే) ఈ నెల 4వ తేదీ నుంచి ఆన్లైన్ పద్ధతి లో పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఈ పిఒపిఎస్ కే ఇప్పటికే ‘‘క్యాంప్ మోడ్’’ లో పనిచేస్తో౦దని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే, ఈ పద్ధతి లో దరఖాస్తుదారులు వారి ఫైళ్ళు పూర్తిగా ప్రాసెస్ కావాలంటే 7 రోజుల నుంచి 10 రోజులకు వేచి ఉండవలసి వస్తోంది.
ఈ జాప్యాన్ని నివారించడం కోసం ఈ నెల 4వ తేదీ నుంచి ఆన్లైన్ పద్ధతి లో పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. దీనితో పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్ర౦ లో దాఖలు చేసిన అన్ని దరఖాస్తుల ప్రాసెసింగ్ రాష్ట్రం లోని ఇతర పాస్పోర్ట్ సేవా కేంద్రాల తో సమానంగా అదే రోజున పూర్తి అవుతాయి. నల్గొండ పరిసర ప్రాంతాలకు చెందిన పాస్పోర్ట్ దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి తాజా సదుపాయాన్ని మెరుగైన రీతిలో ఉపయోగించుకోవాలని తెలియ జేయడమైంది.
For more details related to passport services visit at : https://portal2.passportindia.gov.in/AppOnlineProject/welcomeLink