ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై కన్నేసిన స్మార్ట్‌ఫోన్ మేకర్ ఆపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. 2019 నాటికి భారతదేశంలో టాప్ ఎండ్ ఐఫోన్లను తయారీని ప్రారంభించనుంది. ఇందుకోసం భారీ పెట్టుబడులను పెట్టనుంది. తైవాన్ ఎలక్ట్రిక్ దిగ్గజం ఫాక్స్‌కాన్ స్థానిక యూనిట్ ద్వారా ఖరీదైన ఐఫోన్లను అసెంబ్లింగ్ చేయనుంది. ముఖ్యంగా ఐ ఫోన్ ఎక్స్, ఎక్స్…
ఐటీ సర్వీసుల, స్టార్టప్ రంగాలలో 5లక్షలకు పైగానే ఐటీ ఉద్యోగాలు : మోహన్‌దాస్ పాయ్
దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సర్వీసుల రంగం, స్టార్టప్‌లు వచ్చే ఏడాది భారీ స్థాయిలో నియామకాలు చేపట్టనున్నాయి. 2019లో దాదాపు 5 లక్షల మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్ టి.వి.మోహన్‌దాస్ పాయ్ తెలియజేశారు. ఫ్రెషర్లకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారాయన. దాదాపు…
4జీ సర్వీసు అందించడంలో మరోసారి టాప్‌లో నిలిచిన జియో, ఐడియా
టెలికాం సంచలనం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో దూసుకుపోతోంది. 4జీ సర్వీస్ డౌన్‌లోడ్ స్పీడ్‌లో మరోసారి టాప్‌లో నిలిచింది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) నవంబర్ గణాంకాలను విడుదల చేసింది. అక్టోబర్‌తో పోలిస్తే 4జీ వేగం కొంచెం తగ్గినప్పటికీ 20.3 సెకునుకు ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో టాప్ ఉంది. అక్టోబర్‌లో ఇది 22.3…
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో టైమ్ మేనేజ్‌మెంట్ టూల్
పొద్దున లేచింది మొదలు, రాత్రి నిద్రపోయేంతవరకు సోషల్ మీడియాకు అంతా దాసోహమవుతున్న సందర్భంలో ఉన్నాం. చిన్నా పెద్దా తేడా లేకుండా, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్ లాంటి ప్లాట్ ఫాంలకు అతుక్కు పోతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. అదే సందర్భంలో ఈ సోషల్ మీడియా మ్యానియా నుంచి కాస్తయినా బయటపడాలని భావిస్తున్న వారు లేకపోలేదు. అలాటి వారికోసం ప్రముఖ…
2022 నాటికి 82.9 కోట్లకు చేరనున్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు : సిస్కో విజువల్ నెట్‌వర్కింగ్ ఇండెక్స్
ఇంటర్నెట్ విప్లవంతో భారత మొబైల్ ఫోన్ల మార్కెట్ ఊహించని స్థాయికి చేరుతోంది. 2017లో దేశవ్యాప్తంగా 40.4 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లుండగా… 2022 నాటికి ఈ సంఖ్య రెండింతలు దాటి 82.9 కోట్లకు చేరుతుందని ‘సిస్కో విజువల్ నెట్‌వర్కింగ్ ఇండెక్స్’ వెల్లడించింది. డేటా వినియోగం అంతకంతకూ అధికమవుతుండడంతో నెట్‌కు అనుసంధానమైన ఉపకరణాలు (స్మార్ట్ డివైజెస్) ప్రస్తుత 160 కోట్ల…
753 బిలియన్ డాలర్లతో అతిపెద్ద (మార్కెట్ క్యాప్‌లో) సంస్థగా మైక్రోసాఫ్ట్
టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ను మరో దిగ్గజం సంస్థ మైక్రోసాఫ్ట్ వెనక్కి నెట్టి ముందుకు దూసుకు వచ్చింది. మార్కెట్ క్యాప్‌కు సంబంధించిన మైక్రోసాఫ్ట్ అమెరికాలో నెం.1 కంపెనీగా స్థానాన్ని దక్కించుకుంది. తద్వారా ఇటీవల జోరుమీదున్న ఆపిల్‌కు మైక్రోసాఫ్ట్ గట్టి షాక్ ఇచ్చింది. నాలుగు నెలల క్రితం ఆపిల్ షేర్లు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. ఆగస్టులో 207 డాలర్ల మార్క్‌ను…
16లెన్స్‌ల స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనున్న ఎల్‌జీ
భారతీయ మార్కెట్‌లోకి తిరిగి అడుగు పెట్టిన నోకియా బడ్జట్ స్థాయి నుంచి హైఎండ్ వరకు మొబైల్ విడుదల చేసింది. నోకియా 9 ప్యూర్‌వ్యూను ఐదు రియర్ కెమెరాలతో త్వరలోనే రిలీజ్ చేయనుంది. కొద్ది రోజుల క్రితం శాంసంగ్ నాలుగు వెనుక కెమెరాలతో గెలక్సీ ఎ9 ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఈ మధ్య కెమెరాలను శక్తివంతంగా తీర్చిదిద్దడానికి…
షావోమీ నుంచి 48 ఎంపీ కెమెరాతో సరికొత్త స్మార్ట్ ఫోన్
పదేళ్ల క్రితం నోకియా తన మొబైల్స్‌లో కెమెరాలను అప్‌డేట్ చేస్తూ మొబైల్ మార్కెట్‌ను శాసించిన పరిస్థితులను చూశాము. గత కొద్ది నెలలుగా రిలీజవుతున్న మొబైల్స్‌ను గమనిస్తే ఈ ట్రెండ్ మళ్లీ ప్రారంభమైనట్లు అనిపిస్తోంది. ప్రతీ మొబైల్ కంపెనీ తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో కెమెరాలను అప్‌డేట్ చేస్తున్నాయి. గతవారం హువావే 40 ఎంపీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా…
ఉద్యోగాలను కృత్రిమ మేధస్సు మింగేస్తుందా ..? ఆటోమేషన్ అంటే భయమెందుకు..?
ఆస్ట్రేలియాలోని మేక్వయిర్ యూనివర్సిటీ ఇటీవల దీనిపై ఓ చర్చ నిర్వహించింది. ‘డెలాయిట్ ఆస్ట్రేలియా’ప్రతినిధి జులియట్ బుర్కే ఇందులో పాల్గొన్నారు. మానవ వనరులకు సాంకేతికత ప్రత్యామ్నాయం కాలేదని వివరించారు. సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంపై పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సాఫ్ట్ స్కిల్స్ ఉత్పాదకతను పెంచగలవని చెబుతున్న అధ్యయనాలను ఆమె ఉటంకించారు. బృందంలో భాగమై పనిచేయగలగడం, సహానుభూతి,…
2020కల్లా గూగుల్ హ్యాంగౌట్స్ సేవలు నిలిపివేయనున్న గూగుల్
గూగుల్ హ్యాంగౌట్స్ మెసేజింగ్ యాప్‌కు 2020కల్లా సేవలు నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించుకున్నట్లు నైన్‌టుఫైవ్ గూగుల్ అనే వెబ్‌సైట్ వెల్లడించింది. జిచాట్‌కు ప్రత్యామ్నయంగా 2013లో గూగుల్ సంస్థ హ్యాంగౌట్స్‌ను తీసుకొచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో నెటిజన్లు దీనిని ఆదరించలేదు. దానికి తోడు హ్యాంగౌట్స్‌లో బగ్స్ ఎక్కువగా ఉండేవి. గత కొద్ది కాలంగా గూగుల్ కూడా ఈ యాప్‌పై తన…