• 25శాతం కంప్యూటర్లు, 21శాతం ఫోన్లపై మాలావేర్ దాడులు
• టాప్లో జపాన్, అట్టడుగున అల్జీరియా
• 60 దేశాల్లో అధ్యయనం చేసిన కంపారిటెక్
భారతదేశంలో సైబర్ సెక్యూరిటీలో అధ్వాన్న స్థితిలో నిలిచిందని సెబర్ సెక్యూరిటీ స్టడీ ప్రకటించింది. దేశంలోని 25 శాతం ఫోన్లు, 21శాతం కంప్యూటర్లు మాలావేర్ బారిన పడుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. సైబర్ రక్షణ -సంబంధిత అప్డేటెడ్ చట్టాలు, మాలావేర్ ఎటాక్, సైబర్-దాడులకు సంసిద్ధత లాంటి అంశాలపై యూకేకు చెందిన టెక్నాలజీ పరిశోధనా సంస్థ కంపారిటెక్ 60దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో ఇండియా 46వ స్థానంలో నిలిచింది.
ప్రపంచంలోని అత్యంత సైబర్-సురక్షిత దేశంగా జపాన్ నిలిచింది. కేవలం 1.34శాతం ఫోన్లు, 8 శాతం కంప్యూటర్లు మాత్రమే సెబర్ దాడులకు గురవుతున్నాయి సర్వే వెల్లడించింది. సైబర్ దాడులు నిరోధం, చట్టాలులాంటి అంశంలో తప్ప మిగిలిన అన్ని అంశాల్లో మెరుగా వుందని తెలిపింది. ఈ జాబితాలో ఫ్రాన్స్, కెనడా, డెన్మార్క్, అమెరికా తరువాతి స్థానాల్లో నిలిచాయి. పాకిస్థాన్, చైనా రెండూ సైబర్-సెక్యూరిటీలో అధ్వాన్నంగా ఉన్నప్పటికీ భారతదేశం మొత్తం స్కోరులో 39 శాతం సాధించిందని రిపోర్టు పేర్కొంది. సైబర్దాడులకు సంబంధించి ఈ జాబితాలో అల్జీరియా అట్టడుగున నిలిచింది. అలాగే సరైన చట్టాలు,రక్షణ చర్యలు లేని కారణంగా ఇండోనేషియా, వియత్నం, టాంజానియా, ఉజ్బెకిస్తాన్ ఎక్కువ దాడులకు గురవుతున్నాయని నివేదించింది.
Leave a Reply