జియో.. ఒక సంచలనం.. మొదటగా ఉచితంగా అన్లిమిటెడ్ ఇంటర్నెట్, కాల్స్ ..తర్వాత తక్కువ ధరలోనే ఇంటర్నెట్ కూడా అందిస్తుంది. నెట్ స్పీడ్‌లోను కూడా ఎంతో వేగంగా జియో తన సేవలను అందిస్తుంది. జియో ఫీచర్ ఫోన్స్ కూడా అందరి మన్ననలను పొందాయని చెప్పాలి. జియో పోన్లో యూట్యూబ్, వాట్సాప్ వంటి యాప్స్ కూడా లబించనున్నాయి.
జియోఫోన్.. ఫీచర్ ఫోన్ మార్కెట్లో ఇదో అద్భుతం. స్మార్ట్‌ఫోన్ ప్రముఖ యాప్స్ అయిన వాట్సాప్, యూట్యూబ్‌లను ఈ ఫీచర్ ఫోన్లో అందించడానికి కంపెనీ సిద్ధమైన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఈ యాప్స్ జియోఫోన్‌లో అందుబాటులోకి వస్తాయని 41వ వార్షిక జనరల్ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. కానీ నేటి నుంచి జియోఫోన్‌లో యూట్యూబ్ యాప్ మాత్రమే అందుబాటులోకి వస్తోంది.
జియోఫోన్ యూజర్లు ఎంతో కాలంగా వేచిచూస్తున్న వాట్సాప్ యాప్ మాత్రం అందరికీ అందుబాటులోకి రాదని తెలిసింది. ప్రస్తుతం కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ప్రముఖ మెసేజింగ్ యాప్‌ను లాంచ్ చేసి, ఆ అనంతరం కొన్ని రోజుల తర్వాత మిగతా వారికి అందించాలని కంపెనీ చూస్తోందని వెల్లడైంది. దీని కోసం జియోఫోన్ యూజర్లు కొంతకాలం పాటు వేచిచూడాల్సిందేనని గాడ్జెట్స్ 360 రిపోర్టు చేసింది. బ్యాచ్‌ల వారీగా వాట్సాప్‌ను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
యూట్యూబ్‌ను మాత్రం జియో యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు జియోఫోన్ హై ఎండ్ మోడల్ జియోఫోన్ 2 ను కూడా నేటి నుంచే బుక్ చేసుకోవచ్చు. రేపటి నుంచి ఈ ఫీచర్ ఫోన్ జియో.కామ్‌లో ఫ్లాష్ సేల్‌లో లభ్యమవుతుంది. జియోఫోన్ యూజర్ల కోసం గూగుల్ అసిస్టెంట్‌ను కూడా కొన్ని నెలల కిందటే గూగుల్ తీసుకొచ్చింది.
గూగుల్ మ్యాప్స్ వెర్షన్‌ను కూడా ఈ ఫీచర్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్, యూట్యూబ్ యాప్‌లను మీ వాయిస్ కమాండ్, టెక్ట్స్‌తో ఎలా వాడాలో రిలయన్స్ జియో డైరెక్టర్లు ఆకాశ్, ఇషా అంబానీలు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. యూట్యూబ్‌లో వీడియోను సెర్చ్ చేసుకునేందుకు మీ వాయిస్‌తో సెర్చ్ చేసుకోవచ్చు. అయితే యూట్యూబ్ వీడియోలను ఆఫ్‌లైన్‌గా చూసుకోవడానికి డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం మాత్రం లేదు. టీ9 కీప్యాడ్‌ను వాడుతూ యూజర్లు వాట్సాప్‌లో మెసేజ్‌ను టైప్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫోన్ యూజర్లకు వాట్సాప్ పేమెంట్స్ ఆప్షన్ అందుబాటులో లేదు.