హైదరాబాద్, పిఐబి : భారతదేశంలో ప్రతి పౌరుడికి 50 ఎంబిపిఎస్ స్థాయిలో సార్వజనిక బ్రాడ్ బాండ్ సేవలు, అనుసంధానత కల్పించి ముందుకు తీసుకుపోవడానికి , అన్ని గ్రామ పంచాయతీలకు 1 జిబిపిఎస్ అనుసంధానత కల్పించడానికి, బ్రాడ్ బాండ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాలకు అనుసంధానత కల్పించడానికి , డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడానికి నిర్ణయం.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ 2018(ఎన్‌డిసిపి-2018)ను ఆమోదించింది. అలాగే టెలికమ్ కమిషన్‌ను డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్‌గా మార్పు చేసింది.
డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ ప్రభావంః
• దేశంలో సమర్ధవంతమైన డిజిటల్ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు, సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలు, వివిధ వాణిజ్య సంస్థల సమాచార, కమ్యూనికేషన్ అవసరాలను తీర్చడం ద్వారా డిజిటల్ సాధికారతతో కూడిన ఆర్థిక వ్యవస్థ, సమాజ నిర్మాణానికి మద్దతునిచ్చేందుకు ఎన్.డి.సి.పి -2018 నిర్దేశిస్తున్నది.
• భారత టెలికం రంగంలో అందుబాటులోకి వచ్చిన 5జి, ఐఒటి, ఎం టు ఎం వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కస్టమర్ నిర్దేశిత, అప్లికేషన్ ఆధారిత ఎన్‌డిసిపి -2018, నూతన ఆలోచనలకు, నూతన ఆవిష్కరణలకు దోహదపడుతుంది.
లక్ష్యాలుః
ఈ విధానానికి సంబంధించిన కీలక లక్ష్యాలు కింది విధంగా ఉన్నాయి..
• అందరికీ బ్రాడ్ బ్యాండ్
• డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో 40 లక్షల అదనపు ఉద్యోగాల కల్పన
• డిజిటల్ కమ్యూనికేషన్ రంగం కంట్రిబ్యూషన్‌ను 2017లో భారత జిడిపిలో 6 శాతం ఉండగా దానిని 8 శాతానికి పెంపు
• ఐటియు కు చెందిన ఐసిటి అభివృద్ధి ఇండెక్స్‌లో 2017లో 134 వద్ద ఉన్న భారత్‌ను మొదటి 50 దేశాల జాబితాలోకి చేర్చడం.
• గ్లోబల్ వాల్యూ చెయిన్‌లో భారత్ పాత్రను విస్తృతం చేయడం
• డిజిటల్ సాధికారతను సాధించడం, ఈ లక్ష్యాలను 2022 నాటికి సాధించాలని నిర్ణయం.
మఖ్య లక్షణాలుః
• ఈ విధానం ప్రతి పౌరుడికి 50 ఎంబిపిఎస్ వద్ద సార్వత్రిక బ్రాడ్‌బాండ్ అనుసంధానత కల్పించడం.
• 2020 నాటికి అన్ని గ్రామపంచాయతీలకు 1 జిబిపిఎస్ అనుసంధానతను 2022 నాటికి 10 జిపిఎస్ అనుసంధానతను కల్పించడం.
• బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం అందుబాటులో లేని ప్రాంతాలకు అనుసంధానతను కల్పించడం.
• డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడిని ఆకర్షించడం.
• నవతరం నైపుణ్యాల అభివృద్ధికి అవసరైమన రీతిలో 10 లక్షల మందికి శిక్షణ ఇవ్వడం.
• ఐఒటి ఇకో వ్యవస్థను 5 బిలియన్ అనుసంధానిత పరికరాలకు విస్తరింపచేయడం.
• డిజిటల్ కమ్యూనికేషన్స్‌కు సమగ్ర డాటా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం.
• ఇది ప్రైవసీ, స్వయంప్రతిపత్తి, వ్యక్తుల స్వేఛ్ఛకు సంబంధించిన రక్షణలకు వీలు కల్పిస్తుంది.తద్వారా భారతదేశం గ్లోబల్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో చురుకుగా పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది.
• ఇది తగిన వ్యవస్థీకృత యంత్రాంగం ద్వారా పౌరులకు సురక్షితమైన , భద్రమైన డిజిటల్ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు,సేవలు అందుబాటులోకి తేవడానికి వీలుకల్పిస్తుంది.
వ్యూహంః విధాన ప్రతిపాదనలుః :-
• నేషనల్ ఫైబర్ అథారిటీ ఏర్పాటు ద్వారా డిజిటల్ గ్రిడ్ ఏర్పాటు
• అన్ని కొత్త నగరాలు, హైవే రోడ్ ప్రాజెక్టులలో కామన్ సర్వీస్ డక్ట్‌లు, యుటిలిటి కారిడార్ల ఏర్పాటు
• కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థల మధ్య కామన్ రైట్స్ ఆఫ్ వే కోసం కొలాబరేటివ్ సంస్థాగత యంత్రాంగం ఏర్పాటు
• ధరలు, కాలానికి సంబంధించి ప్రమాణికత
• అనుమతులకు సంబంధించి అడ్డంకుల తొలగింపు
• తదుపరి తరం నెట్ వర్క్‌లకు సంబంధించి ఓపెన్ యాక్సెస్ అభివృద్ధికి వీలు కల్పించడం వంటివి ఉన్నాయి.
నేపథ్యం…
ప్రస్తుతం ప్రపంచం టెలికం రంగంలో 5జి, ఎల్ఒటి, ఎంటు ఎం తదితర అధునాతన సాంకేతిక పరిజ్ఞాన పురోగతిలో ముందుకు పోతున్నది.ఇలాంటి దశలో కస్టమర్ ఆధారిత, అప్లికేషన్ ఆధారిత విధానాలను భారత టెలికం రంగంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇది డిజిటల్ ఇండియా కు మూల స్థంభంగా ఉండనుంది. టెలికం సేవలు విస్తరించదానికి గల అవకాశాలను పెంపొందించడంతోపాటు టెలికం ఆధారిత సేవలను కూడా విస్తరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందుకు అనుగుణంగా కొత్త డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ -2018ని రూపొందించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న నేషనల్ టెలికం పాలసీ 2012 స్థానంలో దీనిని రూపొందించడం జరిగింది. ఇది భారత దేశ ఆధునిక డిజిటల్ కమ్యూనికేషన్ రంగం అవసరాలను తీర్చేదిగా రూపుదిద్దడం జరిగింది.
Leave a Reply