- డేటా ఎనలటిక్స్,డేటా ఎనాలసిస్ ,ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో అపార ఉద్యోగ అవకాశాలు
- చదువుతో పాటు నైపుణ్యాలు ఉన్న వారికే ఉద్యోగ అవకాశాలు
- స్కిల్ తో పాటు విల్ కూడా ఉండాలి
రాబోయే రోజుల్లో వేలాది ఉద్యోగాలు డేటా ఎనలటిక్స్,డేటా ఎనాలసిస్ ,ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో ఉండబోతున్నాయని అమెరికాలోని ప్రముఖ సంస్థ సామా టెక్నాలజీస్ వ్యవస్థాపక సిఈవో సురేష్ కట్టా చెప్పారు, విఐటీ-ఎపి యూనివర్సిటీలో “టాక్ ఆన్ డేటా ఏనలటిక్స్ మరియు ట్రెండ్స్ ఇన్ సాప్ట్ వేర్ “లో జరిగిన వర్క్ షాప్ లో మాట్లాడిన సురేష్ కట్టా విద్యార్ధులు ప్రసుతం విద్యతో పాటు నైపుణ్యాలు పెంపొందించుకుని , సాంకేతిక పరిజ్ఞాన్నాని అందిపుచ్చుకోవాలని అప్పుడే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయని అన్నారు.
విద్యార్ధులకి స్కిల్ తో పాటు విల్ కూడా ఉండాలని, అప్పుడే రాణిస్తారని , ప్రస్తుత మార్కెట్ లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ,మెషిన్ లెర్నింగ్ ,డీప్ లెర్నింగ్ లో కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయని తెలిపారు. విఐటీ-ఎపి విశ్వవిద్యాలయంలో పరిశ్రమ అనుగుణంగా కరిక్యులం బోధించటం పట్ల విఐటీ-ఎపి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ విశ్వనాధన్ మరియు వైస్ చాన్సలర్ డాక్టర్ డి.శుభకర్ లను ప్రశంసించారు.