అఫ్లియేట్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందామా..!

Sharing is Caring | Share This Article

అఫ్లియేట్ మార్కెటింగ్‌…ఆన్‌లైన్‌లో ఈ తరహ మార్కెటింగ్ ఎప్ప‌టినుంచో ఉంది. అయితే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు వెబ్‌సైట్స్‌, బ్లాగ్స్‌ తయారు చేసుకుంటున్నందున ఈ అఫ్లియేట్ మార్కెటింగ్ గురించి తరుచుగా విన్పిస్తుంది. మన వెబ్‌సైట్స్‌, బ్లాగ్‌ల‌ ద్వారా ఇతరుల వెబ్‌సైట్స్‌కు లీడ్స్‌ కానీ, కస్టమర్‌ ద్వారా సేల్‌ జరిగేలా చూడటం కానీ, లేదా అక్కడ రిజిష్టర్‌గా చేసుకోవడం ద్వారా కానీ…ఇలా ఏదేని పద్దతిలో ఒక కస్టమర్‌ వేరే వారికి మన ద్వారా యాడ్‌ అయితే వారు మనకు కమీషన్‌ రూపంలో కొంత డబ్బులు చెల్లించడం జరుగుతుంది. ఈ మొత్తం పద్దతినే అఫ్లియేట్ మార్కెటింగ్ అని పిలుస్తారు. ఇటీవల కాలంలో వెబ్‌సైట్, బ్లాగ్‌ ఓపెన్‌ చేసే ప్రతి ఒక్కరు ఈ అఫ్లియేట్ ద్వారా ఆదాయం పొందవచ్చా… అదెలా సాధ్యమవుతుంది…వంటి ప‌లు సందేహాలు అడుగుతున్న క్రమంలో అఫ్లియేట్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం.

ఆన్‌లైన్‌లో జరుగుతున్నది ఏమిటి…?
ఒకప్పుడు ఇ కామర్స్‌ లేదా ఆన్‌లైన్‌ షాపింగ్‌ అంటే ఇష్టపడేవారు కాదు. కానీ నేడు ఆన్‌లైన్‌ షాపింగ్‌ అనేది పెరిగిపోయింది. ఇంటర్నెట్ దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రావడం, బ్యాండ్‌విడ్త్‌ కూడా (వేగం) పెరగడంతో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. ఇంటర్నెట్‌ను ఆధారం చేసుకుని అనేక మంది తమ ఉత్పత్తులను సేల్‌ చేస్తున్నారు. కొన్ని అయితే పూర్తిగా ఆన్‌లైన్‌లోనే (ఆఫ్‌లైన్‌లో అమ్మకాలు ఉండవు) అన్ని రకాల ఉత్పత్తులను అమ్ముతున్నాయి. ఉదాహరణకు అమెజాన్‌, ఇబే, ఫ్లిప్‌కార్ట్ … వంటి వెబ్‌సైట్స్. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అవసరమున్న వాటిని కొనుగోలు చేయడానికి ఇండియాలో కూడా ఆసక్తి చూపిస్తున్నారు. క్రెడిట్ కార్డు వినియోగం కూడా పెరిగినందున ఆన్‌లైన్‌ షాపింగ్‌కు అనేక మంది ఇష్టపడుతున్నారు. ఈ విధంగా ఆన్‌లైన్‌ ద్వారా అనేక సంస్థలు తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయంట్స్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఈ విధంగా అనేక సంస్థలు తమ వెబ్‌సైట్స్‌ను నెలకొల్పాయి. అయితే వీటికి ట్రాఫిక్‌ రావాలి… అంటే నెటిజన్స్‌ ఈ వెబ్‌సైట్స్‌ను దర్శించాలి. అందులో ఉండే ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. ఈ ప్రాసెస్‌ జరగాలంటే
ఆ వెబ్‌సైట్ ఉన్నట్టు అందరికీ తెలియాలి కదా. అంటే తప్పకుండా సంస్థ గురించి ప్రమోట్ చేసుకోవాలి. అలాగే ఆన్‌లైన్‌లో తమకు సంబందించిన క్లయంట్స్ ఎక్కడ ఉన్నారో వెతకాలి వారికి చేరే విధంగా తమ ఆన్‌లైన్ మార్కెటింగ్‌ను సిద్దం చేసుకోవాలి. ఈ క్రమంలో గూగుల్‌ ద్వారా యాడ్స్‌ను ఈ సంస్థలు ఇస్తుంటాయి. దీన్నే గూగుల్‌ యాడ్‌సెన్స్‌ అని పిలుస్తారు. ఏదేని వెబ్‌సైట్ గూగుల్‌తో టైఅప్‌ కావడం వలన గూగుల్‌ నుంచి యాడ్స్‌ పొందవచ్చు. అ యాడ్స్‌కు గూగుల్‌ సంస్థ పే చేస్తుంది. మన వెబ్‌సైట్‌కు వచ్చే ట్రాఫిక్‌ను బట్టే మనకు ఎంత డబ్బులు ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. యాడ్‌సెన్స్‌ ద్వారానే కాకుండా ఆన్‌లైన్‌లో మరోలా కూడా సంస్థను ప్రమోట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అనేక సంస్థలు తమ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థలు తమ గురించి ప్రమోట్ చేసుకోవడానికి ఆన్‌లైన్‌లోని ఇతర వెబ్‌సైట్స్‌తో టైఅప్‌ అవుతుంటాయి.

సూక్ష్మంగా చెప్పాలంటే మీ వద్ద ఒక వెబ్‌సైట్‌ ఉంది. వెబ్‌సైట్‌ని నిత్యం అనేక మంది నెటిజన్స్‌ క్లిక్‌ చేస్తున్నారు. మీరు ఆ వెబ్‌సైట్‌లో వేరొక వెబ్‌సైట్‌ యాడ్‌ను ఉంచి ప్రమోట్ చేయడాన్నే అఫ్లియేట్ మార్కెటింగ్ అని పిలుస్తారు. మార్కెటింగ్ చేసే వారిని అఫ్లియేట్స్ అని పిలుస్తారు. వెబ్‌సైట్‌ను ప్ర‌మోట్ చేసుకోవడం అఫ్లియేట్ కోడ్‌ లేదా యాడ్‌ని ఇచ్చే వారిని అడ్వర్టయిజర్స్‌ అని పిలుస్తారు. వెబ్‌సైట్‌లోని అఫ్లియేట్‌ యాడ్ ద్వారా లీడ్‌ కానీ సేల్‌ కానీ అడ్వర్టయిజర్‌కి వెళ్లితే కమీషన్‌ రూపంలో డబ్బులు వస్తాయి.

అఫ్లియేట్‌ మార్కెటింగ్ అంటే ఏమిటో అర్థమైంది కదా.. అయితే దీని మరింత సులువుగా అర్థమయ్యే విధంగా వివరంగా తెలుసుకుందాం. ఆన్‌లైన్‌లో లక్షల కొద్దీ వెబ్‌సైట్స్ ఉంటాయి. కానీ వీటిలో మంచి బ్రాండింగ్‌తో ప్రజలకు చేరువలో ఉండే ఆన్‌లైన్‌ సంస్థలు తక్కువగా ఉంటాయి. ఇటువంటి వాటికి మనం ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. వేరే సంస్థలకు మనం అనుసంధానం కావాలంటే (అఫ్లియేట్) మన దగ్గర తప్పకుండా వెబ్‌సైట్‌ లేదా బ్లాగ్‌ ఉండాలి. అఫ్‌లైన్‌లో ఒక సంస్థ డీలర్‌షిప్‌ తీసుకోవడమని అర్థం. ఉదాహరణకు అమోజాన్‌ సంస్థ పేరొందిన ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ. దీనికి అఫ్లియేట్‌గా మారడం ద్వారా డబ్బులు సంపాదించగలం.

ముందుగా మనం ఒక వెబ్‌సైట్‌ను తప్పకుండా డెవలప్‌ చేసుకోవడం ఎంతైనా అవసరం. అలాగే అ వెబ్‌సైట్‌లో మంచి కంటెంట్ ఉండాలి. నిత్యం నెటిజన్స్‌ వస్తూ ఉండాలి. ఎప్ప‌టికప్పుడు అప్‌డేట్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే మన వెబ్‌సైట్ ప్రాచుర్యాన్ని పొందుతుంది. మన వెబ్‌సైట్‌లో ఉంచే డేటాకు తగ్గ విధంగా మనం క్లయంట్స్‌ను ఎంచుకుని వారి నుంచి అఫ్లియేట్ కోడ్‌ ద్వారా యాడ్‌ తీసుకోవాలి. కొన్ని సంస్థలు మాత్రం కామన్‌గా అందరికి సరిపోయే విధంగా ఉంటాయి. ఉదాహరణకు ప్రాచుర్యాన్ని పొందిన Bluehost, Host gator  అనే సంస్థలు ఆన్‌లైన్‌లో వెబ్‌ రిజిస్ట్రేషన్‌, హోస్టింగ్‌ స్పేస్‌ను అందిస్తాయి. వీటిని మీ వెబ్‌సైట్‌లోని డేటాకు సంబందం లేకుండా వీరితో టైఅప్‌ అయి యాడ్స్‌ను పొందవచ్చు. అయితే మనకు వెబ్‌సైట్‌ ఉంది..అఫ్లియేట్ మార్కెటింగ్ అంటే అర్థమయింది.. వీటిని పొందడమెలా…మన వెబ్‌సైట్‌లో ఉంచడమెలా…?

అఫ్లియేట్‌గా మారాలంటే …?
ఆన్‌లైన్‌లో పలు సంస్థలు థర్డ్‌ పార్టీగా ఉంటూ మనకు అఫ్లియేట్ కోడ్స్‌ను అందిస్తున్నాయి. వీటి ద్వారా మనం అనేక సంస్థల యెక్క అఫ్లియేట్‌ కోడ్‌ను పొందగలం. ఇటువంటి వాటిలో ఆన్‌లైన్‌లో బాగా ప్రాచుర్యాన్ని పొందిన వెబ్‌సైట్స్ Clickbank, Commision junction .. ఈ వెబ్‌సైట్స్ ద్వారా మనం టై-అప్‌ అయి వాటి నుంచి అఫ్లియేట్ కోడ్స్‌ను పొందడం…తర్వాత అ కోడ్‌ను నేరుగా మన వెబ్‌సైట్‌లో పేస్ట్‌ చేసి అఫ్లియేట్‌గా మారవచ్చు. ఇలా కాకుండా నేరుగా ఆన్‌లైన్‌లో ఉండే సంస్థల నుంచి కూడా మనం టై అప్‌ అయి అఫ్లియేట్‌గా మారవచ్చు. ఉదాహరణకు బ్లూహోస్ట్‌, హోస్ట్‌గేటర్‌, ఇబే పార్టనర్ నెట్‌వర్క్‌… వంటి వాటి ద్వారా నేరుగా టైఅప్‌ అయి అ సంస్థలకు మనం ఆన్‌లైన్‌లో ప్రమోటర్‌గా మారవచ్చు. అర్ట్స్‌ & ఎంటర్‌టైన్‌మెంట్‌, బిజినెస్‌ & ఇన్వెస్ట్‌మెంట్స్‌, కంప్యూటర్స్‌ & ఇంటర్నెట్‌, ఫుడ్‌ & కుకింగ్‌, ఇ బిజినెస్‌, ఎడ్యుకేషన్‌, ఎంప్లాయిమెంట్‌ & కెరీర్స్‌, గేమ్స్‌, హెల్త్‌ … ఇలా అనేక రకాలైన సంస్థలు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. నేరుగా సంస్థతో కానీ లేదా థర్డ్‌పార్టీగా ఉండే వాటితో కానీ టైఅప్‌ కావాలంటే ఒక పద్దతి ప్రకారం వారితో రిజిష్టర్‌ చేసుకోవాలి.
మీ వద్ద ఉన్న వెబ్‌సైట్‌లోకి యాడ్స్‌ రావాలంటే ఈ కింది విధంగా చేయాలి. ఇక్కడ మీరు నేరుగా థర్డ్‌పార్టీ వెబ్‌సైట్ ద్వారా అయితే పలు సంస్థలకు ప్రమోటర్‌గా మారవచ్చు. అలాగే విడి, విడిగా కూడా వేరే సంస్థలతో టైఅప్‌ అయి యాడ్స్‌ను పొందగలరు. అఫ్లియేట్స్‌ను అందించే వెబ్‌సైట్స్‌తో ఇలా…

మీ ఇమెయిల్‌ ఐడీతో వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిష్టర్‌ చేసుకోవాలి.
తర్వాత మన ఇమెయిల్‌ ఐడీ వెరిఫికేషన్‌ జరుగుతుంది. ఇమెయిల్‌ ఐడీకి వచ్చిన ఇమెయిల్‌ లింక్‌ను క్లిక్‌ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్‌ను చేయవచ్చు.
వెబ్‌సైట్‌లో మీ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకొండి.
ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రొడక్టులను, సర్వీసెస్‌ను సెలెక్ట్‌ చేసుకుని అఫ్లియేట్‌గా మారాలి.
మనం ప్రమోట్ చేయాలనుకునే ప్రతి ప్రొడక్ట్‌కు అఫ్లియేట్ లింక్‌ను జన‌రేట్ చేయాలి.
మన వెబ్‌సైట్‌లో ఉంచాల్సిన సైజ్‌ను బ‌ట్టి ప్రొడక్ట్‌ లేదా సర్వీస్‌ ఇమేజ్‌ని సెలెక్ట్‌ చేసుకోవాలి.
మీ వెబ్‌సైట్‌లో ప్రొడక్ట్‌ ఇమేజ్‌ను అఫ్లియేట్ లింక్‌ను వెబ్‌సైట్‌లో పేస్ట్‌ చేసుకోవాలి. ఇలా చేసిన వెంటనే మన వెబ్‌సైట్‌లో ఈ అఫ్లియేట్‌ యాడ్స్‌ కన్పిస్తాయి. ఇప్పుడు మన వెబ్‌సైట్‌లోకి వచ్చే విజిటర్స్‌ ఈ యాడ్స్‌ను క్లిక్‌ చేసి… అయా ప్రొడక్ట్‌ల వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడ రిజిష్టర్‌ చేసుకోవడం లేదా సేల్‌ చేయడం లేదా ఫార్మ్‌ నింపడం వంటివి చేస్తేనే మనకు కమీషన్‌ రూపంలో ఆదాయం వస్తుంది. కావున ముందుగా మన వెబ్‌సైట్‌ను దమ్ముగా ఉండేలా చూసుకోవాలి. అఫ్లియేట్ యాడ్స్‌ ఇమేజ్‌ల రూపంలో కన్పిస్తూ ఉంటాయి. అదే గూగుల్‌ యాడ్స్‌ లింక్స్‌ రూపంలో కన్పిస్తూ ఉంటాయి.

అఫ్లియేట్ ద్వారా ఆదాయం ఉంటుందా…?
ఆదాయం తప్పకుండా ఉంటుంది. అయితే మనం ఏమి చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా మన వెబ్‌సైట్‌ను చక్కగా డిజైన్‌ చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో ఇచ్చే కంటెంట్‌లో దమ్ము ఉండాలి. అలాగే కంటెంట్‌ను రెగ్యులర్‌గా అప్‌డేట్ చేసుకోవాలి. ఇలా ముందుగా వెబ్‌సైట్‌కు మంచి గుర్తింపును తీసుకుని వస్తే నెటిజన్స్‌ కూడా రెగ్యులర్‌గా విజిట్ చేస్తుంటారు. వెబ్‌సైట్ గుర్తింపు పొందిన తర్వాత మన వెబ్‌సైట్‌కు వచ్చే విజిటర్స్‌ను బ‌ట్టి అలాగే వారు వేటి పైన ఆసక్తి చూపుతారో ఎనాలిసిస్‌ చేసుకుని అటువంటి అఫ్లియేట్ యాడ్స్‌నే సెలెక్ట్‌ చేసుకోవాలి. అలాగే మనం టైఅప్‌ అయ్యే అఫ్లియేట్ నెట్‌ర్క్‌లు కూడా జెన్యూన్‌గా ఉండాలి. అలాగే ఎంచుకునే సంస్థల బ్రాండ్‌ వేల్యూని కూడా చూడండి. అయా సంస్థలు మన ద్వారా వెళ్లే లీడ్స్‌ను మోసం చేయకుండా ఉండాలి. ఇటీవల కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌ అర్డర్‌ ఇచ్చిన తర్వాత మనకు పంపే ప్రొడక్టులలో నాణ్యత లేకుండా ఉంటుంది. కొన్ని సంస్థలు ఇందులో విలువలను పాటిస్తున్నాయి. అలాగే వెబ్‌సైట్స్‌లో ఎక్కడపడితే అక్కడ అఫ్లియేట్ ఇమేజ్‌లను ఉంచకూడదు. ప్రతి పేజిలో చక్కగా కనపడేలా ఒక‌టి లేదా రెండు ఇమేజ్‌లను మాత్రమే ఇవ్వండి. మీ వెబ్‌సైట్‌కు విజిటర్స్‌ వచ్చేలా చూసుకొండి. మంచి డిమాండ్‌ ఉన్న ప్రొడక్టులను ఎంచుకొండి. ఒకే విదమైన ప్రొడక్టులను ఒక పేజిలో ఉంచకుండా చూడాలి. ప్రొడక్టుల మీద మీరు ఏదేని హామీలు ఇవ్వకండి. మీ వెబ్‌సైట్‌లో తప్పకుండా మంచి కంటెంట్‌నే ఇవ్వాలి. కాపీ రైట్‌ చేసిన మెటిరీయల్‌ను ఇవ్వకండి. విజిటర్స్‌ రిలేషన్‌షిప్‌ ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి. సోషల్‌ మీడియాను ఆర్‌ఎస్‌ఎస్‌ ఫీడ్స్‌ను ఉపయోగిస్తూ విజిటర్స్‌ వచ్చేలా చూసుకోవాలి. అంతగా పేరులేని వాటికి అఫ్లియేట్‌గా మారకండి. మీరు అఫ్లియేట్‌గా మారుతున్నారంటే ముందుగా అ సంస్థ గురించి ఎనాలిసిస్‌ చేసి అఫ్లియేట్‌గా మారండి.

అఫ్లియేట్ మార్కెటింగ్ – టెక్‌ జార్గాన్‌ …
మనకు తెలియని టెక్‌ పదాల గురించి తెలుసుకోవడం ద్వారా అఫ్లియేట్ మార్కెటింగ్ గురించి మరింత లోతుగా అర్థం చేసుకునే వీలుంది.
Affiliate : మన వెబ్‌సైట్ ద్వారా ఇతరుల యాడ్స్‌ను (ఇమేజ్‌ రూపంలో) పొంది మన వెబ్‌సైట్‌లో ఉంచితే.. అప్పుడు మనల్ని అ వెబ్‌సైట్‌కు అఫ్లియేట్‌గా ఉన్నామని పిలుస్తారు. మన ద్వారా వెళ్లే విజిటర్‌, సబ్‌స్రైబర్‌, కస్టమర్‌ లేదా జరిగే సేల్‌ వలన డబ్బులు వస్తాయి.
Pay per impression or Cost per click (CPC) : అఫ్లియేట్‌లో పలు రకాల మెథడ్స్ ఉంటాయి. వీటి ద్వారానే డబ్బులను లెక్కించి ఇస్తుంటారు. మొద‌టిది వచ్చేసి అడ్వర్టయిజ్‌మెంట్‌ను ఉంచిన పబ్లిషర్‌ (అఫ్లియేట్ వెబ్‌సైట్స్‌ వారు) కొంత ఫిక్స్‌డ్ అమౌంట్ పొందుతారు. అంటే యాడ్‌కు వచ్చే ఇంప్రెషన్స్‌ను బ‌ట్టి పేమెంట్ ఉంటుంది.
Pay per click (PPC) or Cost per click (CPC) : ఇది అఫ్లియేట్ మార్కెటింగ్ లో ఎక్కువగా ఉపయోగించేది బాగా పాపులర్‌ అయిన మెథడ్‌. ఈ పద్దతిలో అడ్వర్టయిజర్‌ వారి లింక్‌ను క్లిక్‌ చేసి వెబ్‌సైట్‌లోకి వెళ్లితేనే డబ్బులు కమీషన్‌ రూపంలో ఇస్తుంటారు. క్లిక్‌ చేస్తే ఆదాయం వస్తుంది. అయితే ఇక్కడ ఫ్రాడ్‌ క్లిక్స్‌ను  count చేయరు. ఐపీ నంబర్‌ ద్వారా క్లిక్స్‌ ఎలా వస్తున్నాయనేది అంచనా వేయడం జరుగుతంది.

Pay per lead (PPL) or cost per lead : ఇది కూడా మరో మెథడ్‌. బాగా ప్రాచుర్యాన్ని పొందింది. ఇందులో మన వెబ్‌సైట్ ద్వారా అఫ్లియేట్ యాడ్‌ను క్లిక్‌ చేసి అడ్వర్టయిజర్‌కు వెళ్లే లీడ్‌కి కొంత డబ్బులు చెల్లిస్తారు. ఈ డబ్బులు కాస్త ఎక్కువగానే ఉంాయి.

Pay per sale (PPS) or cost per sale :  అఫ్లియేట్ మార్కెటింగ్ లో పాపులర్‌ అయిన మరో మెథడ్‌. ఇందులో అడ్వర్టయిజర్‌కు వెళ్లే నెటిజన్స్‌ ఏవేని కొనుగోలు చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. ఇటువంటి వాటికి కమీషన్‌ ఎక్కువ.
Pay per call : పబ్లిష్‌ చేసిన యాడ్స్‌ ద్వారా వచ్చే ఫోన్‌ కాల్స్‌కు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది.

clickbank.com … అతి పెద్ద మార్కెట్ ప్లేస్‌. ఇందులో అనేక మంది మీతో అఫ్లియేట్ కావడానికి సిద్దంగా ఉంటారు. మంచి బ్రాండ్స్‌ లేదా ప్రొడక్టులు లేదా సర్వీస్‌లను ఎంచుకొండి. గత 10 సంవత్సరాలుగా వీరు దాదాపుగా 2 బిలియన్‌ డాలర్లను వారి అఫ్లియేట్స్‌కు చెల్లించడం జరిగింది.
cj.com : ఇది కూడా క్లిక్‌ బ్యాంక్‌ మాదిరిగానే. ఇందులో కూడా అనేక మంది తమ ఉత్పత్తులను మీ ద్వారా ప్ర‌మోట్ చేయడానికి సిద్దంగా ఉంచారు. ప్రొడక్టులను ఎంచుకోవడమే తరువాయి.
bluehost : ఆన్‌లైన్‌లో పేరొందిన హోస్టింగ్‌ ప్రొవైడర్‌. ప్రతి సేల్‌కు కొంత మొత్తంలో డాలర్ల పే చేస్తుంది. నేరుగా ఈ వెబ్‌సైట్‌కు అఫ్లియేట్‌గా మారి ప్ర‌మోట్ చేయండి.
Apple affiliate program : యాపిల్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇటువంటి వాటికి అఫ్లియేట్ కావడం ద్వారా మంచిగా ఎర్నింగ్‌ చేసే అవకాశం ఉంది. ఐట్యూన్స్‌, యాప్స్‌, ఇతర యాపిల్‌ డిజిటల్‌ ప్రొడక్టులను ప్రమోట్ చేయడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు.
ebay partner network : ఆన్‌లైన్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఇబే .. వంటివి గుర్తింపు పొందిన ఇకామర్స్‌ వెబ్‌సైట్స్‌. ఇటువంటి వాటితో అసోసియేట్ కావడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందగలరు.
amazon associates : మరో గుర్తింపు పొందిన అడ్వర్టయిజర్‌. నేరుగా వీరితో అసోసియేట్ అయి అఫ్లియేట్‌గా మారవచ్చు. కమీషన్‌ క్లిక్‌బ్యాంక్‌, సిజె కంటే తక్కువగా ఉంటుంది. ఒక్కో సేల్‌కు 8.5 శాతం వరకు వస్తుంది.
host gator : బ్లూహోస్ట్‌ మాదిరిగానే పేరొందిన మరో హోస్టింగ్‌ ప్రొవైడర్‌. దీని ద్వారా వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్‌, హోస్టింగ్‌ స్పేస్‌ రెండు లబిస్తాయి. ఒక్కో సేల్‌కు కమీషన్‌ 125 డాలర్ల వరకు ఉంటుంది.

మీకిష్టమైన వాటినే ప్ర‌మోట్ చేయండి. మీ వెబ్‌సైట్‌లోని డేటా మీ అభిరుచులకు తగ్గ విధంగా ఉన్న మంచి బ్రాండ్‌లను సెలెక్ట్‌ చేసుకొండి. అప్పుడు మీరే చేసే ప్రమోషన్‌ కూడా ఇష్టంగా చేస్తారు కాబ్టి ఖచ్చితంగా పలితాలు ఉంటాయి. దీని వలన ఎర్నింగ్స్‌ కూడా ఉంటాయి. మీకు, అడ్వర్టయిజర్‌కు అలాగే మన ద్వారా లీడ్‌ తీసుకుని కొనుగోలు చేసి ఎండ్‌ యూసర్‌ కూడా సంతోషంగా ఉంటాడు. ఇతర వెబ్‌సైట్స్‌కు మార్కెట్ చేయడంతో పాటుగా మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడం కూడా అవసరమే.


Sharing is Caring | Share This Article

About Computers For You

Computers For You (CFY) is a Leading Telugu Technology & Career Magazine. In addition to the Print Edition, We have been bringing out Web Edition also with Daily Tech News & Updates. This is one of the Largest Circulated magazine in Telugu Language in Telangana (TS) and Andhra Pradesh (AP) States and also reaching across South India.
View all posts by Computers For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *